మరో ఐటెమ్ సాంగ్ కి సిద్దమైన కాజల్..ఈసారి ఎవరితోనో తెలుసా?

344
Kajal-Agarwal
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడవ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజాగా రెండో షెడ్యూల్ ని కూడా ప్రారంభించారు. గీతా ఆర్ట్‌, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

బన్ని సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటించగా..కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ టబు నటిస్తుంది. ఇక ఈసినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ ను సంప్రదించారట చిత్రయూనిట్. ఇందుకు ఆమె కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈమధ్య సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ స్టార్ హీరోయిన్స్ తో చేపిస్తున్న సంగతి తెలిసిందే.

కథకు తోడుగా స్టార్ హీర్స్ గ్లామర్ తో సినిమాకు మరింత హైప్ తీసుకువస్తుందని భావిస్తున్నారు దర్శకులు. కాజల్ గతంలో ఎన్టీఆర్ సరసన ఐటెం సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈవార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

- Advertisement -