మరోసారి చిరంజీవితో కాజల్

372
chiranjeevi-kajal
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ న విడుదల కానుంది. సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , కన్నడ హీరో సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా లు కీలక పాత్రలో నటించారు. ఇటివలే విడుదలైన చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.

ఈమూవీ తర్వాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. త్వరలోనే చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈమూవీని కొరటాల మిత్రుడు నిర్మించనున్నాడని సమాచారం. అయితే ఈమూవీలో హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

- Advertisement -