నిరుపేద బాలిక కు కవితక్క భరోసా..

467
k kavitha
- Advertisement -

ఆర్మూర్ నియోజకవర్గం ‌మాక్లూరుకు చెందిన గిరిజన బాలిక నందిని కల్వకుంట్ల కవితను‌ కలిసారు. ఈ సందర్భంగా నందిని ఆరోగ్యం బాగోగుల గురించి తెలుసుకున్న కవిత, అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నందినికి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తనకు‌ సమాచారం అందించాలని నందిని ఉపాధ్యాయులు మరియు బంధువులకు సూచించారు ‌కల్వకుంట్ల కవిత. అంతేకాదు పదో తరగతి పరీక్షలు రాస్తున్న నందినికి‌ ఆల్ ది బెస్ట్ చెప్పి ఉత్సాహాన్ని నింపారు. చదువులో ఎప్పుడూ టాపర్ గా ఉండే నందినిని అభినందించిన‌ కవిత.. నందిని బొమ్మలు గీసే నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. కవిత సహాయం వెలకట్టలేనిదన్న నందిని.. కవిత ప్రోత్సాహంతో ఉన్నత చదవులు పూర్తి చేస్తానంటూ విశ్వాసం వ్యక్తం చేసింది.

k kavitha

నందిని నేపథ్యం..

ఆర్మూరు నియోజకవర్గం మాక్లూరుకు చెందిన నందిని చదువులో టాపర్. మాక్లూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నందిని అక్షరాలు రాసినా.. బొమ్మలు గీసినా అద్భుతంగా ఉండేవి. అయితే షుగర్, థైరాయిడ్‌తో బాధపడుతున్న నందినికి కంటిచూపు మందగించింది. నిత్యం ఇన్సులిన్ ఇంజక్షన్ వేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నా, వ్యాధి తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ కలవరపెడుతోంది. తండ్రి చిన్నప్పుడే మరణించడం..తల్లి మానసిక వ్యాధితో మంచం పట్టడంతో నందిని పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

k kavitha

అయితే విషయం తెలుసుకున్న కల్వకుంట్ల కవిత, నందినికి మెరుగైన చికిత్స అందించేందుకు సిద్ధమైంది. బాలికను హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.కంటికి చికిత్స నిర్వహించడంతో నందిని ఆరోగ్యం కుదుటపడింది. తిరిగి ఆమె కోలుకునే వరకూ బాగోగుల గురించి నిరంతరం పర్యవేక్షించారు కల్వకుంట్ల కవిత. నందినితో పాటు స్కూల్ ప్రిన్సిపల్, ఎంఈఓ మరియు ఇతర ఉపాధ్యాయులు కవితని కలిసారు.

- Advertisement -