దేశంలో తెలంగాణ పోలీసులు నెం.1

484
K Damodar Gupta
- Advertisement -

జనగామ జిల్లా ఎసిపి కార్యాలయంలో పోలీస్ హౌజింగ్ కర్పొరేషన్ చైర్మెన్ కె.దామోదర్ గుప్తా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖలో అధునాతన భవనాలు, అధునాతన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. దేశంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. పోలీసు శాఖకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కె.దామోదర్ గుప్తా తెలిపారు.

అలాగే రాష్ట్రంలో పన్నెండు జిల్లాలో ఎస్పీ కార్యాలయ భవనాల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాము. రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో పోలీసు భవనాలు నిర్మాణం జరుగుతున్నాయి. రెండవ విడుతలో 500 కోట్ల రూపాయలతో అత్యాధునిక వాహనాలను పోలీసు శాఖకు కేటాయించడం జరిగింది. అని పోలీస్ హౌజింగ్ కర్పొరేషన్ చైర్మెన్ కె.దామోదర్ గుప్తా పేర్కొన్నారు.

- Advertisement -