‘లిటిల్‌ టైగర్‌’తో యంగ్‌టైగర్‌.. ఫోటో వైరల్‌

74

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీకి మాత్రం కావల్సినంత సమయాన్ని కేటాయిస్తాడు. పుట్టిన రోజు, పెళ్లి రోజు లాంటి స్పెషల్‌ డే అయితే ఫ్యామిలీతోనే గడుపుతాడు. ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టిన రోజు, పెళ్లి రోజున సోషల్‌మీడియాలో ట్వీట్లు, పోస్ట్‌లు హోరెత్తించాయి.

ఎన్టీఆర్‌ తన పెద్ద కుమారడు అభయ్‌ రామ్‌ చేసే అల్లరి గురించి తన అభిమానులకు సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ ఉంటాడు. ఇక గతేడాది సరిగ్గా ఇదే రోజు.. తన కుటుంబంలోకి ఇంకొకరు వచ్చి చేరారని ట్వీట్‌ చేశాడు ఎన్టీఆర్‌.అది ఎవరో మీకూ తెలుసు.. అతడు మరెవరో కాదు ఎన్టీఆర్‌ రెండో కుమారుడు భార్గవ్‌ రామ్‌.

Junior NTR

శుక్రవారం తొలి పుట్టినరోజు జరుపుకొంటున్నాడు భార్గవ్‌ రామ్‌. ఈ సందర్భంగా తారక్‌.. సోషల్‌మీడియాలో అపురూపమైన ఫొటోలను పంచుకున్నారు. భార్గవ్‌ను ఎత్తకుని మురిపెంగా చూస్తున్న ఫొటోతో పాటు, పెద్ద కుమారుడు అభయ్‌ తన తమ్ముడి పక్కన కూర్చున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘భార్గవ్‌ తొలి పుట్టినరోజు’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

ఈ ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. తారక్‌ ఈ ఫొటోలు పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే దాదాపు 40 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అందరూ భార్గవ్‌ను ‘లిటిల్‌ టైగర్‌’ అని సంబోధిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.