రేపు జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్‌ ప్రారంభం..

38
Jubilee Hills Check Post metro station starts tommrow

మెట్రో కారిడార్‌-3లో భాగంగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రోస్టేషన్‌ను శనివారం ప్రారంభం కానుంది. సాంకేతిక, నిర్మాణ పనుల వల్ల ఈ స్టేషన్‌ నిర్మాణం కాస్త ఆలస్యంగా కాగా ప్రస్తుతం అన్ని పనులు పూర్తిచేసుకుని అందుబాటులోకి రానుంది. ఈ స్టేషన్‌ రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో నాగోల్‌ – హైటెక్‌సిటీ మార్గంలో అన్ని స్టేషన్లలో మెట్రో ఆగనుంది.

అమీర్‌పేట – హైటెక్‌సిటీ మధ్య దూరం 10 కిలో మీటర్లు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు ఉండగా, ఈ కారిడార్‌ ప్రారంభ సమయంలో ఐదు స్టేషన్లను అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన మాదాపూర్‌, పెద్దమ్మగుడి, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు స్టేషన్లను వరుసగా అందుబాటులోకి తీసుకువచ్చారు. హైటెక్ సిటీ రూట్లో మెట్రో అందుబాటులోకి రావడం వల్ల సాప్ట్ వేర్ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తప్పాయి.