నాని ‘జెర్సీ’ చూసి ఎన్టీఆర్ ఏమన్నాడో చూడండి..

351
Nani Jersey
- Advertisement -

న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘జెర్సీ’ ఏప్రిల్ 19న విడుదల అయింది.ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.మూవీ పై పలువురు టాలీవుడ్‌ స్టార్స్ అభినందనలు తెలిపారు. ఇక సినిమా విడుదల రోజే నాని అండ్ టీం కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి భారీ ప్రశంసలు దక్కాయి. సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా జెర్సీ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

నేచురల్‌ స్టార్ నానిని చూస్తే ఎంతో గర్వంగా ఉందని అంటున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘Bro నాని.. నీ అద్భుతమైన ప్రదర్శనతో బంతి బౌండరీలు దాటింది. అద్భుతం, అద్భుతం, అద్భుతం. ఈ సినిమాలో నీ నటనను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా నన్ను రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ ఎక్కించింది. ఇంతటి అద్భుతమైన కథ రాసుకుని, చక్కగా తెరకెక్కించినందుకు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరికి హ్యాట్సాఫ్‌. గౌతమ్‌ విజన్‌ను అర్థంచేసుకుని, ఆయనకు మద్దతిచ్చినందుకు చిత్రబృందానికి అభినందనలు’ అని పేర్కొన్నారు యంగ్ టైగర్‌.

తారక్‌తో పాటు దర్శకుడు హరీశ్‌ శంకర్‌, సుధీర్‌బాబు, మంచు మనోజ్‌, గాయకుడు కాల భైరవ,హరీశ్‌ శంకర్‌ తదితరులు కూడా ‘జెర్సీ’ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్లు పెట్టారు.

- Advertisement -