‘ఎంతమంచి వాడవురా’ ప్రీ రిలీజ్‌కు ఎన్టీఆర్ ఫిక్స్‌..

364
kalyan ram
- Advertisement -

నందమూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా మెహ్రీన్ హీరోయిన్‌గా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత‌మంచివాడ‌వురా`. ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు.

ntr

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ ఒక పోస్టర్‌ను కూడా వదిలారు. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ – జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.

- Advertisement -