ఎన్టీఆర్ న్యూ మూవీ.. షూటింగ్ షురూ..

319
‏ Jr NTR and Trivikram film starts rolling, shoot begins with action sequence
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తాజాగా ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ సినిమా ఈ రోజు(శుక్రవారం) షూటింగ్ ప్రారంభించారు చిత్ర యూనిట్. రామ్-లక్ష్మణ్ సారధ్యంలో ఒక ఫైట్ సీన్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో చి్త్రీకరిస్తున్నారు.

వీరిద్దరి కలయికలో సినిమా ఎప్పడొస్తుందా..అని జూ.ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వీరిద్దరి కలయికలో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఎన్టీఆర్ అభిమానులే కాకుండా త్రివిక్రమ్ అభిమానుల కూడా ఎదురు చూస్తున్నారు. ‘జై లవకుశ’ తర్వాత సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిదే కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Jr NTR and Trivikram film start

త్రివిక్రమ్ పంచ్ డైలాగులు, ఎన్టీఆర్ నటన తోడైతే సినిమా ఏ రేంజులో ఉంటుందో చెప్పనక్కర్లేదు. తాజాగా త్రివికమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్‌ హీరోగా మనముందుకొచ్చిన చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రంతో త్రివిక్రమ్ భారీ ప్లాఫ్ ను మూటగట్టుకున్నారు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ పై కొందరు విమర్శలు కూడా చేశారు. వారి విమర్శలను తిప్పికొడుతూ అభిమానులకు మంచి హిట్ ఇవ్వాలని త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నారు సీ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.‏

- Advertisement -