ఆర్చర్ బౌన్సర్‌కి కుప్పకూలిన స్మిత్‌

286
smith

జెంటిల్మన్ గేమ్ అంటే ఇదేనేమో.. దెబ్బ తగిలిన మొండి ధైర్యం ప్రదర్శించి క్రికెట్ ఫ్యాన్స్‌ గుండె గెల్చుకున్నారు స్టీవ్ స్మిత్‌. కెప్టెన్‌గా గొప్ప ఇన్నింగ్స్ ఆడిన స్మిత్‌ ఆస్ట్రేలియా గౌరవ ప్రదమైన స్కోరు సాధించడంలో కీ రోల్ పోషించాడు.

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు స్మిత్. ఆర్చర్ వేసిన బౌన్సర్‌కి కుప్పకూలాడు స్మిత్. దీంతో రిటైర్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో తిరిగి క్రీజులోకి వచ్చిన స్మిత్ పట్టుదలతో బ్యాటింగ్ చేసి ఆసీస్ గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో కీ రోల్ పోషించాడు.

సెంచరీ చేజారినా స్టీవ్‌ స్మిత్‌ (161 బంతుల్లో 92; 14 ఫోర్లు) మరో అద్భుత ఇన్నింగ్స్‌తో తన ఫామ్ కొనసాగించాడు. స్మిత్ పోరాటంతో తొలి ఇన్నింగ్స్‌లో జట్టు 250 పరుగులకు ఆలౌటై ఇంగ్లండ్‌ స్కోరు (258)కు దగ్గరగా వచ్చింది. ప్రస్తుతం స్మిత్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.