జియో వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌..

106
JIo

కొత్త కొత్త ఆఫ‌ర్ల‌తో వినియెగ‌దారుల‌ను అట్రాక్ట్ చేస్తుంది రిల‌య‌న్స్ జియో సంస్ధ‌. త‌క్కువ ధ‌ర‌కే ఇంట‌ర్ నెట్ ఇవ్వ‌డంతో పాటు కొత్త కొత్త ప్లాన్ ల‌ను విడుద‌ల చేస్తున్నారు. దీంతో టెలికం రంగంలో ప్ర‌స్తుతం జియో టాప్ నెంబ‌ర్ 1 లో కొన‌సాగుతుంది. ఇక తాజాగా మ‌రో ప్లాన్ ప్ర‌వేశ పెట్టి జియో వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది జియో సంస్ధ‌. మోస్ట్ పాపుల‌ర్ ప్యాక్ అయిన రూ. 399రిచార్జ్ చేసుకుంటే రూ.50 క్యాష్ బ్యాక్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

JIo
ఇక రూ.399తో రిఛార్జ్ చేసుకుంటే 3 నెల‌ల పాటు నెట్ తో పాటు అప‌రిమిత కాల్స్ మ‌రియు రోజుకు వంద మేస్ జ్ ల‌ను కూడా ఇస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ కొత్త ప్యాక్ తో క‌స్ట‌మ‌ర్ల‌ను అట్రాక్ట్ చేస్తుంది. ఫ్లిప్ కార్ట్ కు చెందిన ఫోన్ పే ఆప్ తో ఒప్పందం కుదుర్చుకున్న జియో హాలీడే హంగామా పేరుతో ఈ కొత్త యాప్ ను ప్ర‌కటించింది. మై జియో ఆప్ లో ఫోన్ పే ద్వారా రూ. 399 పెట్టి రిఛార్జ్ చేసుకున్న వారికి రూ. 50 క్యాష్ బ్యాక్ ల‌భించ‌నుంది. ఈ ఆఫ‌ర్ నేట నుంచ ఈనెల 15 వ తేది వ‌ర‌కూ మాత్ర‌మే వ‌ర్తించ‌నున్న‌ట్లు తెలిపింది.

Reliance Jio

ఇప్ప‌టికే మై జియో ఆప్ నుండి రిఛార్జ్ చేసుకున్న వారికి జియో సంస్ధ రూ.50క్యాష్ బ్యాక్ ఇస్తుండ‌గా..ఇప్పుడు మ‌రో రూ.50 లు క్యాష్ ఇవ్వ‌నుంది. మొత్తం మూడు నెల‌ల‌కు గానూ రూ.399 పెట్టి రిఛార్జ్ చేసుకుంటే రూ.100క్యాష్ బ్యాక్ రానుంది. దీంతో జియో కు ఇంకా కొంత మంది వినియోగ‌దారులు పెరిగే అవ‌కాశం ఉంది.