జెర్సీ.. యూస్‌ ప్రీమియర్‌ షో రివ్యూ ..

101
Jersey

న్యాచురల్ స్టార్ నాని నటింటించిన జెర్సీ మూవీ నేడు థియేటర్లలోకి అడుగు పెట్టింది. మంచి ఫీల్ గుడ్ ఎమోషన్ ఉన్న స్పోర్ట్స్ మూవీగా రూపొందించారు డైరెక్టర్‌ గౌతమ్ తిన్నూరి. ఇదివరకే విడుదలైన ట్రైలర్ నుంచి ఓ భారీ అంచనాలు రేపిన జెర్సీ యుఎస్ ప్రీమియర్లు షోలు నిన్నటి నుంచే మొదలు మొదలైయ్యాయి. ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం 7 గంటల వరకు 112 లొకేషన్లలో మూవీ రిలీజ్ అయింది.

ఇక సినిమా విషయానికొస్తే.. నాని ఎప్పటిలాగే న్యాచురల్‌గా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.. స్టోరీలో మూడు వేరియేషన్స్‌ ఉన్న పాత్రలు చేశాడు నాని. తన కెరిర్‌లో దీ బెస్ట్‌ మూవీగా చెప్పుకోవచ్చు. ఇక డైరెక్టర్‌ గౌత‌మ్ తిన్నూరి చేసిన గ్రౌండ్ వ‌ర్క్, స్టోరీ బోర్డ్ వంటివి చాలా బాగున్నాయి. సినిమాలో అక్కడక్కడ కొద్ది సాగదీసినట్టు అనిపించినా మూవీ చాలా బాగుంది. క్లైమాక్స్‌లో మాత్రం ప్రతి ఒక్కరూ లేచి క్లాప్స్‌ కొట్టాలనిపించే రేజ్‌ వుంది. ఈ చిత్రం క్లాసిక్‌ హిట్‌గా టాక్‌ వినిపిస్తోంది. ఇప్పుడున్న సిట్చువేష‌న్‌లో ఇలాంటి సినిమాను షూట్ చేయ‌డం చాలా క‌ష్టం. యుఎస్‌లో ప్రీమియర్‌ షో చూసి ప్రేక్షకుల్లో మంచి రెప్పాన్స్‌ వస్తోంది. మొత్తానికి నాని జెర్సీకి సూపర్‌ హిట్ టాక్‌ వినిపిస్తుంది.