కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి షాక్..

356
Karnataka Govt
- Advertisement -

కర్ణాటకలో కొద్ది రోజులుగా తలెత్తిన రాజకీయ సంక్షోభానికి రేపటితో తెరపడనుంది. తాజాగా కర్ణాటక సంకీర్ణ ప్రభత్వానికి మరో షాక్ తగిలింది. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని ప్రకటించిన బీఎస్పీ ఎమ్మెల్యే మహేశ్ తాజాగా ఆయన యూటర్న్ తీసుకున్నారు. కర్ణాటకలో బీఎస్పీకి ఒక ఎమ్మెల్యే ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఇన్ని రోజులు ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని ప్రకటించి తాజాగా ఆయన ప్లేట్ ఫిరాయించారు.

కాంగ్రెస్-జేడీఎస్ కు తన మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సూచన మేరకే మహేశ్ తన మద్దతును ఉపసంహరించుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 106. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ బలం 107 ఉంది. ఒకవేళ బీజేపీకి మహేశ్ మద్దతు లభిస్తే ఆ సంఖ్య 108కి చేరుతుంది.

- Advertisement -