కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద.. గోదావరి ప్రవాహ ఉధృతి

286
Kalshwaram
- Advertisement -

తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ పరవళ్ళు తొక్కుతోంది. గోదావరిలో కలుస్తున్న ప్రాణహిత వరదనీటి ప్రవాహాంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. నీటి ప్రవాహంతో గోదావరి నీరు ఉరకలెత్తుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలం కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఎత్తి పోసేందుకు నీరు అనుకూలంగా ఉండడంతొ నాలుగవ పంపు ద్వారా కూడా నీళ్లను నిన్న రన్ చేశారు. నిన్న కన్నెపల్లి పంప్ హౌస్ లో 1,3,4,6వ పంపులా ద్వారా జలాలను ఎత్తి పోశారు.6,4,3 మూడు పంపులు ప్రస్తుతం నడుస్తున్నాయి.

ప్రస్తుతం గోదావరి ప్రాణహిత లో 25 వేల కుసెక్కల నీరు ప్రవహిస్తోంది. 1వ పంపు ద్వారా0.8 టీ యం సి అంటే 9320 క్యూసెక్కులు,3వ పంపు ద్వారా 0.2 టీ యం సి అంటే 2312 కూసెక్కులు , 6వ పంపు ద్వారా 0.5 టీ యం సి అంటే 5225 క్యూసెక్కులు, 4 వ పంపు ద్వారా 600ల క్యూసెక్కుల నీళ్లు, ఇప్పటి వరకు మొత్తం 17857 కుసేక్కుల నీటిని 13.5 కిమి గ్రావిటీ కెనాల్ గుండా వెళ్లి అన్నారం బ్యారేజ్ కు చేరుకున్నాయి. అంటే దాదాపు 1.63 టిఎంసి ల జలాలు పంపులా ద్వారా అన్నారం బ్యారేజ్ లోకి చేరుకున్నాయని అధికారులు తెలియజేస్తున్నారు.

- Advertisement -