ఎన్సీఎల్పీ నేతగా జయంత్ పాటిల్..

575
jayant patil
- Advertisement -

మహారాష్ట్రలో క్షణం క్షణం ఉత్కంఠను రేపుతున్న పాలిటిక్స్‌పై సుప్రీం కోర్టు కాసేపట్లో కీలకతీర్పు వెలువరించనుంది.ఈ నేపథ్యంలో సుప్రీం వెలువరించే తీర్పు ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

ఇక ఎన్సీఎల్పీ నేతగా అజిత్ పవార్‌ను తొలగించిన శరద్ పవార్….ఆయన స్ధానంలో జయంత్ పాటిల్‌ను అసెంబ్లీ ప్లోర్‌ లీడర్‌గా నియమించారు. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి లేఖ అందింది.

మరోవైపు తాను ఇంకా ఎన్సీపీలో ఉన్నానని, శరద్‌పవారే తన నాయకుడని అజిత్‌పవార్ సుప్రీంకోర్టులో స్పష్టం చేశారు. ఆయన తరఫున హాజరైన మనీందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. గవర్నర్‌కు లేఖ అందించిన సమయంలో తాను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఉన్నాను. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం తనకు ఉందని చెప్పారు. అయితే అజిత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు శరద్ పవార్.

The Legislature Secretariat has received a letter claiming that Jayant Patil is the Legislative Party Leader for NCP

- Advertisement -