రివ్యు: ‘జయమ్ము నిశ్చయమ్మురా’

292
Jayammu Nischayammu Review
- Advertisement -

టాలీవుడ్‌లో హీరోలుగా మారిన హాస్యనటుల జాబిత పెద్దదే. అలాంటి వారిలో శ్రీనివాస్ రెడ్డిది ప్రత్యేకమైన గుర్తింపు. గీతాంజలి’ సినిమాతో హీరోగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టి సక్సెస్ అందుకున్న ‘శ్రీనివాస్ రెడ్డి’ మరో ప్రయత్నంగా చేసిన చిత్రమే ఈ ‘జయమ్ము నిశ్చయమ్మురా’. భారీ ప్రమోషన్ల మధ్య, మంచి పాజిటివ్ టాక్ మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో శ్రీనివాస్ రెడ్డి ఆకట్టుకున్నాడో లేదో చూద్దాం…

కథ:

సర్వ మంగళం అలియాస్ సర్వేష్ కుమార్‌ (శ్రీనివాస్ రెడ్డి) ఉద్యోగం కోసం సిటీకి వస్తాడు. తనిలో ఆత్మన్యూనతా భావం ఎక్కువ. అందుకే తనలోని శక్తి సామర్థ్యాల్ని వదిలేసి.. అమాయకంగా అంధ విశ్వాసాల్ని నమ్ముతుంటాడు. ప్రతి విషయానికీ బాబా పిత (జీవా) చెప్పే జోస్యానికి విలువనిస్తూ ఆయన మీద ఆధారపడుతుంటాడు. ఈ క్రమంలో రాణి(పూర్ణ)ని ప్రేమిస్తాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకుని తన బాస్ ద్వారా త్వరగా ట్రాన్ఫర్ చేయుంచుకుని సొంత ఊరికి వెళ్లిపోవాలనే లక్ష్యం పెట్టుకుని ఆ పని మీదే ఉంటాడు.

Jayammu Nischayammu Review

కానీ ఇంతలోనే తన బాస్ రాణిని వలలో వేసుకుంటాడు. అది తెలిసిన సర్వమంగళం తన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వలన రాణికి దగ్గరవలేక, ఆమెను దుర్మార్గుడైన బాస్ కు విడిచిపెట్టి దూరంగా వెళ్లలేక నానా అవస్థలు పడుతుంటాడు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సర్వమంగళం రాణిని ఎలా కాపాడుకున్నాడు ? సర్వమంగళం జాతకాల పిచ్చిని వదిలి పెట్టాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి? ఎలా తన ప్రేమను రాణికి చెప్పాడు ? చివరికి తన లక్ష్యమైన ట్రాన్ఫర్ ను పొందాడా లేదా ? అన్నది తెరమీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్… కథ.. కథనం, సెకండాఫ్ కామెడీ. శ్రీనివాసరెడ్డి.. పూర్ణ వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయారు. తత్కాల్‌గా ప్రవీణ్‌.. అడపా ప్రసాద్‌గా కృష్ణభగవాన్‌.. పంతులుగా పోసాని ఆకట్టుకునేలా నటించారు. జేసీ చడ్డాగా రవివర్మ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో ఒదిగిన తీరు బాగుంది. ఫస్టాఫ్ కథంతా హీరో అమాయకత్వం.. అతడి జాతకాల పిచ్చి.. సహోద్యోగుల తీరుతో పండే వినోదంతోనే సాగుతుంది. తెరపై కనిపించే ప్రతి పాత్ర మన జీవితంతో ముడిపడినట్టుగానే అనిపిస్తుంది.తెరపై కనిపించే ప్రతి పాత్ర మన జీవితంతో ముడిపడినట్టుగానే అనిపిస్తుంది.ఫస్టాఫ్, సెకాండాఫ్ లలో పేద బ్రాహ్మణుడి పాత్రలో పోసాని చేత, ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కృష్ణ భగవాన్ చేత చేయించిన కామెడీ ఆద్యంతం రంజింపజేసింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో పోసాని కామెడీ బాగా కనెక్టయింది.

Jayammu Nischayammu Review

మైనస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్‌లో కామెడీ లేకపోవడం, సాగదీతగా సాగే కొన్ని సన్నివేశాలు. సినిమా మొదలైన చాలా సేపటి వరకూ అసలు కథలోకి వెళ్లకుండా పాత్రలను పరిచయం చేయడంలో ఎక్కువ సమయాన్ని కేటాయించి ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం ముందు వరకూ బోర్ కొట్టించాడు. అలాగే సినిమాలో సర్వమంగళం పాత్ర చుట్టూ కొన్ని అనవసరమైన సన్నివేశాలు నడిచి కాస్త విసిగించాయి. ఇక సెకండాఫ్ లో కూడా సర్వమంగళం పాత్ర పూర్తిగా మారిపోయిన తరువాత వచ్చే కొన్ని అనవసరమైన సన్నివేశాలు, పాత్రలు కథను కాస్త పక్కదారి పట్టించాయి.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులు పడతాయి.ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు కథను, దానికి తగినంత కామెడీని కలుపుకుని కథనం రాసుకున్న దర్శకుడి రచనా ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. రవిచంద్ర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించింది. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాలోని అన్ని పాత్రలకు ముఖ్యంగా పోసాని, కృష్ణ భగవాన్ పాత్రకు రాసిన డైలాగులు బాగున్నాయి. ఇక నిర్మాతగా కూడా వ్యవహరించిన శివరాజ్ కనుమూరి నిర్ణమాన విలువలు బాగున్నాయి.

Jayammu Nischayammu Review

తీర్పు:

నిజజీవితంలోని పాత్రల చుట్టూ తెలివిగా అల్లి తెరకెక్కించిన చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా. మంచి కథ, కామెడీ, ఎంటర్టైన్మెంట్, శ్రీనివాస్ రెడ్డి మార్క్ నటన సినిమాకు ప్లస్ పాయింట్ కాగా…సాగదీత సన్నివేశాలు, సెకండాఫ్ కథ కాస్త దారి తప్పడం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా వాస్తవిక కథలను, కామెడీని కోరుకునే వారికి నచ్చే శ్రీనివాస్ రెడ్డి జయమ్ము నిశ్చయమ్మురా.

విడుదల తేదీ:24/11/206
రేటింగ్:3/5
నటీనటులు: శ్రీనివాసరెడ్డి, పూర్ణ
సంగీతం: రవిచంద్ర
నిర్మాతలు: శివరాజ్‌ కనుమూరి, సతీష్‌ కనుమూరి
దర్శకత్వం: శివరాజ్‌ కనుమూరి

- Advertisement -