అమ్మ త్వరలోనే పాలన పగ్గాలు చేపట్టనుందా..?

231
online news portal
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఉత్కంఠ వీడడం లేదు. అమ్మ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని,, తర్వలోనే అందరి ముందుకు వస్తుందని చెప్పుకొస్తున్నా,,,తమిళ జనాల్లో ఇంకా పలు అనుమానాలకు దారి తీస్తూనే ఉంది. అమ్మను మళ్లీ మునపటిలా ఎప్పుడు చూస్తోమోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఎస్.రామచంద్రన్ ఓ ప్రకటన చేశారు. అమ్మ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని,,అమ్మ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆమె పూర్తిగా కోలుకుంటున్నారని, కొన్ని రోజుల్లో యథాతథంగా రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తారని ఆయన దీమా వ్యక్తంచేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆమె అభిమానుల పూజలు, ప్రత్యేక ప్రార్థనలు ఫలించి జయలలిత కోలుకుంటున్నారని చెప్పారు.

online news portal

సీఎం ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని అపోలో వైద్యులు చెప్పారని జయ సన్నిహితురాలు, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతీ మీడియాకు తెలిపారు. ఇప్పుడిప్పుడే జయలలిత నార్మల్ లైఫ్ లోకి వస్తున్నారని చెప్పారు. ఆహారం తీసుకుంటున్నారని,, అయితే ఆమె పూర్తిగా కోలుకునేంతవరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని తెలియజేశారు. పార్టీ నేతలు, ప్రజలు చేసిన పూజలు, ప్రార్థనల వల్ల అమ్మ మళ్లీ మామూలు మనిషి అయ్యారని హర్షం వ్యక్తంచేశారు. దీపావళి పండుగకు జయలలిత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అవుతారని అక్టోబర్ 27న ప్రకటన విడుదల అవుతుందని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో బీ ఫాం పై జయలలిత సైన్ చేయకుండా,,వేలి ముద్రలు పెట్టడంతో,,కొంత అనుమానాలకు తావిచ్చినట్టైంది. పైగా గత రెండు వారాలుగా ఆమె ఆరోగ్యంపై ప్రభుత్వంగానీ, అస్పత్రి వర్గాలుగానీ హెల్త్ బులెటిన్స్ కూడా లేకపోవడంతో అమ్మ అభిమానుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే అధికార ప్రతినిధి ద్వారా ఓ ప్రకటన చేశారు. దీంతో తమిళ్ ప్రజల్లో కాస్త నమ్మకం కుదిరినట్టైంది. డీహైడ్రేషన్, జ్వరంతో బాధపడుతున్న సీఎం జయలలిత సెప్టెంబర్ 22నుంచి చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో జయ చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -