ప్రభాస్‌ కోసం క్యూ కట్టిన జపాన్‌ భామలు..!

477
prabhas japan ladies
- Advertisement -

బాహుబలి మూవీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌. భారత్‌తో పాటు పలు దేశాల్లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలో ప్రభాస్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో వివిధదేశాల్లో ప్రభాస్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్ పెరిగిపోగా జపానీయుల అభిమానాన్ని సైతం చూరగొన్నారు ప్రభాస్.

ఈ నేపథ్యంలో జపాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రభాస్‌ ఫ్యాన్స్ ఆయనను కలవడానికి ఇంటికి వెళ్లారు. అంతా కలిసి గ్రూప్‌ ఫోటో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం సాహో సినిమాతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా యువీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేసి ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

- Advertisement -