చార్మి స్కెచ్‌..డియర్ కామ్రేడ్‌తో జాహ్నవి..!

393
janhvi vijay

ఇస్మార్ట్ శంకర్ హిట్‌తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. రామ్ హీరోగా తెరకెక్కిన ఈమూవీ దాదాపు 90 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు పూరి. ఇక ఈ మూవీలో యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాగా ప్రస్తుతం స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు పూరి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్ డేట్ టీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాహ్నవిని తీసుకొనున్నారనే ప్రచారం జరుగుతోంది. జాహ్నవి కపూర్‌ని ఒప్పించడానికి ఛార్మీని రంగంలోకి దించారట పూరి. ఇందుకోసం బోనీ అపాయింట్ మెంట్ తీసుకున్న ఛార్మి…సినిమా కథను వినిపించనున్నట్లు టాక్‌.

జాహ్నవి సైతం తన ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని ఇటీవల ఓ షోలో చెప్పింది. ఒకవేళ తాను దక్షిణాది సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తే అది విజయ్ దేవరకొండ సినిమాతోనే అంటూ చెప్పేసింది. దీంతో జాహ్నవిని హీరోయిన్‌గా కన్ఫామ్ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతుందట ఛార్మి. వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మూవీలో జాహ్నవి హీరోయిన్‌గా నటిస్తే విపరీతమైన క్రేజ్ ఏర్పడి మార్కెట్ చాల సులువుగా అయిపోతుందని పూరి-ఛార్మీ భావిస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా వీరు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.