బెల్లీ డాన్స్‌తో అదరగొట్టిన జాన్వీ కపూర్‌..!

101
Janhvi Kapoor

అందాల తార స్వర్గీయ శ్రీదేవీ ముద్దుల తనయగా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్‌. మొదటి సినిమా ధడక్‌ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా.. జాన్వీ లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఫస్ట్‌ మూవీ ఫలితం ఎలాగున్నా బీటౌన్‌లో జాన్వీ ఫాలోయింగ్‌ బాగానే ఉంది. జాన్వీ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలకు రెడీ అవుతూ ఉంది. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, పొట్టి దుస్తుల్లో కెమెరా కళ్లకు చిక్కుతూ సోషల్‌ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

తాజాగా జాన్వీ బెల్లీ డ్యాన్స్‌ చేస్తూ ఉన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జాన్వీకపూర్, ఇషాన్‌కట్టర్, వరుణ్‌ధావన్‌కు శశాంక్ కైతాన్ ఓ డాన్స్‌ షోలో ఛాలెంజ్ విసిరాడు. ఆ ప్రోగ్రామ్‌కి సంబంధించిన థీమ్ సాంగ్‌కు జాన్వీకపూర్ తనదైన స్టైల్‌లో బెల్లీ డ్యాన్స్ చేసి అదరగొట్టింది. మరోవైపు ఇషాన్ ఖట్టర్ కూడా ఈ థీమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను కలర్స్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వరుణ్ ధవన్ మాత్రం ఇంకా ఛాలెంజ్‌ను స్వీకరించాల్సి ఉంది.