గ్రీన్‌ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన జనగామ కలెక్టర్‌..

270
Jangaon Collector
- Advertisement -

గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ట్విట్టర్‌లో జనగాం జిల్లా కలెక్టర్‌కు గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరిస్తూ జనగాం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఈ రోజు మొక్కలు నాటి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్‌ను విసిరారు.

జనగాం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి వరంగల్ రూరల్,మహబూబాబాద్,ములుగు జిల్లా కలెక్టర్లను గ్రీన్ ఛాలెంజ్ కొరకు ఆహ్వానించారు. దీనిపై ఎంపీ సంతోస్‌ కుమార్‌ స్పందిస్తూ.. జనగామ కలెక్టర్‌కు ధన్యవాదాలు అని తలిపారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ తలపెట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌ గత కొంతకాలంగా ఉద్యమంలా ముందుకు దూసుకుపోతోంది. ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు.

- Advertisement -