దిల్ రాజు పై పవన్ కళ్యాణ్ సీరియస్

206
Pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం పింక్ రీమేక్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 20న మూవీ షూటింగ్ ప్రారంభమైంది. బాలీవుడ్ నిర్మాత బోని కపూర్, దిల్ రాజు లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. అజ్నాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్‌ చేస్తున్న సినిమాకావడంతో ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సామాన్యంగా స్టార్ హీరోల సినిమాలు అంటే లీక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే షూటింగ్ జరుగుతున్న సమయంలో ఫోన్లను వాడనివ్వరు. అలాంటిది పవన్ కళ్యాన్ తొలి రోజు షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

pawan

షూటింగ్ జరిగిన వివరాలు బయటకు రాకుండా.. పవన్‌తో పాటు నిర్మాత దిల్ రాజు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కూడా పవన్ షూటింగ్ పిక్స్, వీడియోలు లీక్ అయ్యాయి. ఈ విషయంపైనే దిల్ రాజుపై పవన్ కాస్త సీరియస్ అయ్యారట. ఇప్పటి నుంచైనా.. షూటింగ్‌కి సంబంధించిన వివరాలు కాస్త జాగ్రత్తగా ఉంచాలని సూచించాడట. ఈమూవీలో పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందని తెలుస్తుంది.