జనసేనకు రూ.100 కోట్ల విరాళం..!

449
janasena

పవర్ స్టార్,జనసేనాని బర్త్ డే సందర్భంగా పవన్‌కు సినీ,రాజకీయాలకు అతీతంగా శుభాకంక్షలు వెల్లువెత్తాయి. ఇక జనసేనానికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు పార్టీ కార్యకర్తలు,ఫ్యాన్స్‌. జనసేనకు రూ.100 కోట్ల విరాళమే లక్ష్యంగా క్యాంపెయిన్ చేపట్టారు.

జనసేన కార్యకర్తల కమిట్‌మెంట్‌ చూసి షాకయ్యారు మెగా బ్రదర్‌,జనసేన నాయకుడు నాగబాబు. తన యూట్యూబ్ ఛానల్‌ ‘నా ఛానెల్.. నా ఇష్టం’ ద్వారా పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత పవన్‌ ఫ్యాన్స్‌ , కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడిన తీరును వివరించారు.

పవన్ బర్త్ డే సందర్భంగా జనసేన పార్టీకి దాదాపు 100 కోట్ల రూపాయల విరాళాన్ని సేకరించాలని నిర్ణయించుకున్నారంట. మొదట ఈ విషయాన్ని విని తాను ఆశ్చర్య పోయానని చెప్పారు. ఇప్పటివరకూ ఏ పార్టీకి వాళ్ల పార్టీ అభిమానులు ఇలా సేకరించలేదని,అదీ అభిమానుల్లో పవన్‌కు ఉన్న స్థానమని అభినందించారు.చాలా మంది పార్టీ అభిమానులు శనివారమే బ్యాంక్‌కు క్యూ కట్టి డొనేషన్లు ఇచ్చారని చెప్పారు.