నిఘంబోధ్ ఘాట్‌లో జైట్లీ అంత్యక్రియలు

305
jaitly

గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ(66)ఇవాళ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో ఢిల్లీలోని ఎయిమ్స్ నుండి అరుణ్ జైట్లీ భౌతికకాయాన్ని కైలాష్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించనున్నారు.

రేపు ఉదయం పది గంటల వరకు అభిమానులు సందర్శనార్ధం అందుబాటులో ఉంచనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తల, ప్రజల సందర్శనార్థం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో అరుణ్ జైట్లీ భౌతికకాయాన్ని చివరిసారిగా చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం నిఘంబోధ్ ఘాట్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.

కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో మధ్యాహ్నం 12.01 గంటలకు తుదిశ్వాసవిడిచారు.