అంజలి- జై… ఓ రొమాంటిక్ బర్త్ డే

348
Jai and Anjali going strong
- Advertisement -

జర్నీ సినిమాతో ఆకట్టుకున్న  అచ్చ తెలుగు హీరోయిన్ అంజలి.ఆ మధ్య కుటుంబ కలహాలు, వివాదాలతో హాట్ టాపిక్‌గా మారిన ఈ బ్యూటీ జర్నీ హీరో జైతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు పుకార్లు షికార్ చేసిన సంగతి తెలిసిందే.   అయితే, దీనిపై వీరిద్దరు స్పందించలేదు కానీ  జ్యోతిక భర్త సూర్య విసిరిన  దోశ ఛాలెంజ్   వీరిద్దరి సన్నిహిత స్నేహాన్ని వెలుగులోకి తెచ్చింది.

జై పుట్టిన రోజు సందర్భంగా అంజలి షూటింగ్ స్పాట్ కు వెళ్లి సర్ ప్రైజింగ్ పార్టీ ఇవ్వడం, ఆ రోజంతా వారిద్దరూ భార్య భర్తల్లానే ఉన్నారని యూనిట్ చెప్పడంతో వారి మధ్య ప్రేమకు మించినదేదో ఉందని అభిమానులు ఫిక్సైపోయారు. నిన్న జరిగిన అంజలి పుట్టిన రోజును పురస్కరించుకుని జై సోషల్ మీడియా వేదికగా అంజలిపై ప్రేమను కురిపించాడు.

నువ్వంటే నాకు ఎంత ప్రత్యేకమో… నీ పుట్టిన రోజన్నా అంతే ప్రత్యేకం అంటూ నువ్వు నీలానే ఉంటూ నా లైఫ్‌ లో ప్రతి రోజును ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దావ్‌. దేవుడు, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాం. హ్యాపీ బర్త్‌ డే అంజూ. ప్రేమతో… జై!’’అంటూ స్వయంగా రాసిన లేఖను ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీనికి అంజలి నాతో ఉన్నందుకు థ్యాంక్స్‌ జై. నువ్వెప్పుడూ ఉంటావని ఆశిస్తున్నా..ప్రత్యేకమైన రోజు ప్రత్యేకమైన లేఖ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అతని లేఖను రీట్వీట్ చేసింది. దీంతో వీరిద్దరి ప్రేమ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Happy Birthday Anjali

- Advertisement -