ప్రభాస్ “జాన్” లో జగపతిబాబు

493
jagapathi-babu
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా ఇటివలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం ప్రభాస్ అభిమానులను నిరాశపరిచింది. కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించినా సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఇక మూవీ తర్వాత ప్రభాస్ జిల్ మూవీ దర్శకుడు రాథకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

ఈసినిమాకు జాన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కొంత వరకు పూర్తైంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ సరసన పూజా హెగ్డె హరోయిన్ గా నటిస్తుంది. 1950ల కాలంలో ఇటలీలో జరిగే ప్రేమకథగా ఈసినిమా తెరకెక్కుతుంది.

ఈమూవీకి సంబంధించి మరో వార్త ఫిలీం నగర్ వర్గాల్లో చక్కర్లుకొడుతుంది. ఈమూవీలో విలన్ పాత్రలో జగపతిబాబు నటించనున్నాడని సమాచారం. ఈమూవీలో జగపతిబాబు కొత్త గెటప్ లో చూపించనున్నారని తెలుస్తుంది. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత వచ్చే నెలలో తిరిగి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

- Advertisement -