జగన్ క్యాబినెట్ ఇదే..సోషల్ మీడియాలో వైరల్

94
Jagan

ఏపీలో ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికలు హాట్ హాట్ గా సాగిన విషయం తెలిసిందే. ఈసారి గెలుపుపై టీడీపీ, వైసీపీలు అధికారంపై గట్టి నమ్మకంతో ఉన్నాయి. మే23న ఫలితాలు వెలువడటంతో ఇరు పార్టీల్లో ఆసక్తినెలకొంది. ఇప్పటికే వైసిపి తన ఏంజెట్లకు కౌంటింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేసింది. ఏపీకి కాబోయే సీఎం జగన్ అంటూ సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం జరుగుతుంది. గెలుపుపై టీడీపీ కంటే వైసిపి వర్గాల్లోనే ధీమా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైసిపికి చెందిన మరో వార్త వైరల్ గా మారింది.

జగన్ ముఖ్యమంత్రిగా తన క్యాబినెట్ మినిస్టర్ల పేర్లను కూడా ఖరారు చేసినట్లు ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏపీలో కొంత మంది వైసీపీ నాయకులు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అంటూ బ్యానర్లు కూడా కట్టేశారు. వైరల్‌ గా మారిన ఈ లిస్ట్ లో జగన్ కు అనుకూలంగా ఉన్న వారికే మంత్రి పదవులు ఇచ్చినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ఉండగా, స్పీకర్ గా దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు, డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి పేర్లు ఉన్నాయి. ఇక హోం శాఖ మంత్రిగా జగన్ కు ఆప్తుడయినటువంటి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పేరు లిస్ట్ లో ఉంది.

2. బొత్స సత్యనారాయణ – రోడ్లు మరియు భవనాలు
3. ధర్మాన ప్రసాదరావు -రెవెన్యూశాఖ
4. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -ఆర్థిక శాఖ
5. కొడాలి నాని -భారీ నీటిపారుదల శాఖ
6. గడికోట శ్రీకాంత్ రెడ్డి -మున్సిపల్ శాఖ
7. తానేటి వనిత -స్త్రీ, శిశు సంక్షేమ శాక
8. పిల్లి సుభాష్ చంద్రబోస్ -పౌర సరఫరాలుశాఖ
9. అవంతి శ్రీనివాస్ -వైద్య ఆరోగ్యశాఖ
10. కురసాల కన్నబాబు -విద్యాశాఖ
11. తమ్మినేని సీతారాం -బీసీ సంక్షేమం
12. శిల్ప చక్రపాణి రెడ్డి -అటవీశాఖ
13. వై. విశ్వేసర్ రెడ్డి -న్యాయశాఖ
14. కోన రఘుపతి -దేవాదాయ ధర్మదాయశాఖ
15. ఆనం రాంనారాయణ రెడ్డి -పంచాయితీరాజ్
16. మోపిదేవి వెంకటరమణ -ఐటీ శాఖ మంత్రి
17. ఆర్. కే. రోజా -విద్యుత్ శాఖ
18. బాలినేని శ్రీనివాస్ రెడ్డి -భూగర్భ గనులశాఖ
19. గ్రంధి శ్రీనివాస్ -సినిమాటోగ్రఫీ
20. ఆళ్ళ నాని -కార్మిక, రవాణా శాఖ
21. కె. భాగ్యలక్ష్మి – సాంఘీక సంక్షేశాఖ
22. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి -వ్యవసాయ శాఖ మంత్రి
23. అమంచి కృష్ణ మోహన్ -మార్కెటింగ్ మరియు పశు సంవర్థక
24. కె. ఇక్బాల్ అహ్మద్ -పర్యావరణ శాఖ
25. కొక్కిలిగడ్డ రక్షణనిధి -హౌసింగ్
26. కాకాని గోవర్ధన్ రెడ్డి -భారీ పరిశ్రమల శాఖ

ఎమ్మెల్యేలుగా గెలుస్తారా లేదా అన్నదానిపై కొంత మందికి అనుమానం ఉండగా..ఈలిస్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఈలిస్ట్ పై టీడీపీ, వైసిపి వర్గాలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి మరి.