సీఎం కేసీఆర్‌కు జగన్‌ ఫోన్..ఎందుకో తెలుసా.!

225
kcr jagan
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 14న ఏపీలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. విశాఖలో జరిగే శారద పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్నారు. దీంతో పాటు వైసీపీ అధినేత జగన్‌ కొత్త ఇళ్లు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నట్లు సమాచారం. అమరావతిలో కొత్తగా ప్రారంభించనున్న తన గృహప్రవేశ కార్యక్రామనికి రావాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు జగన్‌. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో జగన్‌ ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ వార్తలను టీఆర్ఎస్ వర్గాలు దృవీకరించాయి.

సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్‌వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు ఏపీకి వెళ్లనున్నట్లు సమాచారం.

దేశంలో గుణాత్మక మార్పుకోసం సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా,ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌,కర్ణాటక సీఎం కుమారస్వామి,తమిళనాడు ప్రతిపక్షనేత,డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌తో భేటీ అయ్యారు. అంతేగాదు ఇటీవలె కేటీఆర్ లోటస్‌ పౌండ్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. తాజాగా కేసీఆర్‌-జగన్‌ భేటీ కానుండటం కన్ఫామ్ కావడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -