మందు బాబులకు షాక్‌..సాయంత్రం 6 వరకే లిక్కర్..!

458
ap liquor policy
- Advertisement -

ఏపీలో మద్య నిషేదం అమలుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్‌. తొలిదశలో బెల్టు షాపులను ఎత్తివేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న జగన్‌…మద్యం అమ్మే టైమింగ్స్‌లోనూ మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగుల విధుల మాదిరిగానే రాత్రంతా షాపులు బంద్‌ ఉండేలా ఉదయం 10 గంటల నుంచి సాయంత్కం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు.

సాయంత్రం అమ్మకాలను తగ్గించడం ద్వారా పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు తగ్గుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మందుబాబులు అధికంగా రాత్రే మద్యం తాగుతుండటం, వైన్స్ షాపులు కిక్కిరిసి పోతున్న నేపథ్యంలో ఆ సమయంలో షాపులు మూసేస్తే చాలావరకు అమ్మకాలు తగ్గుతాయని ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది.

అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అక్టోబరు నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానున్నందున ప్రభుత్వం పలు రకాల కొత్త ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది. ఇక ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది జగన్‌ సర్కార్‌.

దీంతో పాటు ప్రస్తుతం ఏపీలో వందలరకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువ డిమాండ్ ఉండేది సగం బ్రాండ్లకే. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 బ్రాండ్లకు మించి దొరకవు. ఈ నేపథ్యంలో పరిమితమైన బ్రాండ్లను మాత్రమే అమ్మేలా చూసి, మిగతా వాటన్నిటికీ స్వస్తి పలకాలని చూస్తోంది. మొత్తంగా ఏపీ ప్రభుత్వం తీసుకురానున్న నూతన మద్యం పాలసీ ఏ విధంగా ఉండబోతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

- Advertisement -