ముగిసిన ముఖ్యమంత్రుల సమావేశం..

443
kcr jagan meeting
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సమావేశం ముగిసింది. గోదావరి జలాల మళ్లింపు, రాష్ట్ర విభజన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రగతి భవన్‌లో సుమారు మూడు గంటల పాటు ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. అయితే, ఈ చర్చల అజెండా ఏమిటో బయటకు రాలేదు. ఈ సమావేశంలో ప్రధానంగా నీటి పంపకాలపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.

cm kcr

గోదావరి జలాలు శ్రీశైలం డ్యామ్‌కు తరలింపు, విభజన అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. గోదావరి జలాల తరలింపుపై ప్రతిపాదనలను రెండు రాష్ట్రాల ఇంజనీర్లు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. గోదావరి జలాలను ఎలా తరలిస్తే ప్రయోజనకరంగా ఉంటుందనే అంశంతో పాటు అంచనా వ్యయం, తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు ఈ సమావేశంలో తెలంగాణ నుంచి వినోద్‌, సంతోష్‌, ఏపీ నుంచి మిథున్‌ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -