సాహో..జాక్వెలిన్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..!

378
sahoo

ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో ట్రైలర్ ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడి అవుతోంది. ఇందులో భాగంగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయి U/A సర్టిఫికెట్ పొందింది. ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించడం విశేషం.

తాజాగా సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఐటెం సాంగ్‌లో నటించిన జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ కేవలం ఒక్క పాటలో నటించినందుకు రూ. 2 కోట్ల పారితోషికంగా అందుకుందట. బాలీవుడ్‌ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని జాక్వలిన్‌కు ఇంత భారీ అమౌంట్ ఇచ్చారట.

అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా వస్తోంది సాహో. హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. ప్రభాస్ కెరీర్ లొనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. శ్ర‌ద్ధా క‌పూర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజ‌య్, జాకీ ష్రాఫ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భారీ ఖర్చుతో యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.