గ్రీన్ ఛాలెంజ్ గొప్పకార్యక్రమం: జాకీష్రాఫ్

518
jackie shraff
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు 4 కోట్లకు పైగా మొక్కలను నాటగా సినీ,రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాదు మరో ముగ్గురిని మొక్కలు నాటాల్సిందిగా కోరుతున్నారు. దీంతో గ్రీన్ ఛాలెంజ్‌ ప్రజా ఉద్యమంలా సాగుతోంది.

తాజాగా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ గ్రీన్ ఛాలెంజ్‌పై ప్రశంసలు గుప్పించారు. ఇప్పటివరకు తాను కీకీ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్‌ లాంటి చూశానని చెప్పారు. కానీ ప్రస్తుతం గ్రీన్ ఛాలెంజ్ నడుస్తోందని…ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి ఆ మొక్కతో సెల్ఫీ తీసుకొని మరో ముగ్గురికి ఛాలెంజ్ ఇస్తున్నారని ఇది గొప్ప కార్యక్రమం అన్నారు.

హిందీలో ప్రముఖ కామెడియన్ కపిల్ శర్మ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జాకీష్రాఫ్  గ్రీన్ ఛాలెంజ్ అంశాన్ని ప్రస్తావించారు..ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన జాకీష్రాఫ్…తమకు నచ్చిన మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా కపిల్ శర్మను మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -