మొక్కలు నాటిన జబర్ధస్త్ గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్

566
Getup Srinu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని విశేషమైన స్పందన వస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కమెడియన్ సుడిగాలి సుధీర్ , బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ విసిరిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించారు జబర్ధస్త్ కమెడీయన్లు ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను. వారి ఇంటి ఆవరణలో ఇద్దరు మొక్కలు నాటారు.

అనంతరం గెటప్ శ్రీను దర్శకుడు పూరి జగన్నాథ్ , ఆకాష్ పూరి , నిర్మాత ఛార్మి లకు సవాల్ విసరగా, రామ్ ప్రసాద్ యాంకర్ ప్రదీప్ , పారా బ్యాట్ మెంటన్ ప్లేయర్ మానసి జోషి , జబర్దస్త్ కమెడియన్ హైపర్ అది లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

Green

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆకుపచ్చ ప్రపంచం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థను అభినందించినారు . ఎంపీ సంతోష్ కుమార్ ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని గెటప్ శ్రీను , ఆటో రామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

auto RamPrasad

- Advertisement -