రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ చంటికి గాయాలు…

257
chalaki chanti

సినీనటుడు చలాకీ చంటికి ఘోర ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చంటికి గాయాలయ్యాయి. చంటి ప్రయాణిస్తున్న కారు (టీఎస్ 07 జీఎం 0060)ని లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో చంటికి గాయాలయ్యాయి. కోదాడ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం చంటిని హైదరాబాద్‌కు తరలించారు.

ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.చంటికి యాక్సిడెంట్ అయిన సంగతి తెలుసుకుని ఆయన సన్నిహితులు ఆందోళనకు గురయ్యారు.ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్‌ కామెడీ షోలో కమెడియన్‌గా మంచి గుర్తింపు పొందారు. పలు తెలుగు చిత్రాల్లో కామెడీ నటుడిగా కనిపించి మెప్పించాడు.