నిజామాబాద్‌లో టీఆర్ఎస్ హవా..

153
trs nizamabad

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతోంది. మెజార్టీ జడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా వెళ్తొంది. ఇక నిజామాబాద్‌లో టీఆర్ఎస్ సత్తాచాటింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకూ వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్ 70, కాంగ్రెస్ 25, బీజేపీ 10, స్వతంత్ర్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం శంకోర టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థి మూడ్ పద్మ వసంత్ రావు 74 తో గెలుపొందారు.ఆలూరు-2 టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మీ ,నూత్‌పల్లిలో స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి సంజీవ్,కొప్పర్గలో టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థి 303 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భద్రాద్రి కొత్తగూడెం – ఆళ్లపల్లి మండలం అనంతోగు టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి మంజుభార్గవి విజయబావుటా ఎగురవేశారు.

మొత్తం 534 జెడ్పీటీసీ, 5659 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 32 జిల్లాల్లో 123 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మూడు విడుతలుగా ఏప్రీల్ 6, 10, 14 తేదీల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసిన 21,356 మంది అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలనుంది.