ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి..

249
rajathakumar

చందానగర్ సర్కిల్ కొండాపూర్ లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఐటి రంగ ఉద్యోగులు, నిపుణులకు ఓటరు నమోదు, సవరణపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాయింట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రవికిరణ్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ దాసరి హరిచందన పాల్గొన్న ఈ ఓటరు నమోదు అవగాహనా సమావేశంలో ఓటరు నమోదు మార్గాలు, ఓటరు జాబితాలో సవరణలు తదితర అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ.. ఓటరు నమోదుకు,మార్పులు చేర్పులకు మరియు తొలగింపులకు జాతీయ ఓటరు సేవా వెబ్ సైట్,ఈ సేవా సెంటర్లు,సిటిజన్ సర్వీస్ సెంటర్లు,ఇంటింటికి BLO ల ద్వారా సమాచారం సేకరణ లాంటి అనేక మార్గాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని వాటికి కావలసిన వివిధ సపోర్టు డాక్యుమెంట్స్ జతచేసి ఓటరు తమ ఓటరు కార్డు పొందాలని సూచించారు.

ఓటర్లు తమ అనుమానాలను నివృత్తి చేసుకుని ఒక భాద్యత గల పౌరునిగా ప్రతి ఎన్నికలో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రతి ఎన్నికల్లో నమోదు అవుతున్న తక్కువ ఓటింగ్ శాతం నిర్మూలనకు అందరూ కృషి చేసి మన భారత ప్రజాతంత్ర వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో DCP వెంకటేశ్వర్లు, డిప్యూటీ కమిషనర్ లు రమేష్, వెంకన్న, యాదగిరి రావు, బాలయ్యలతో పాటు సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సైబరాబాద్ నుండి భరణి, శ్రీనివాస్, లెట్స్ వోట్ ఆర్గనైజేషన్ నుండి సుబ్బ రంగయ్య, NGO ఆర్గనైజేషన్ నుండి మేజర్ శివకిరన్, యూసుఫ్ గుడా, శేరిలింగంపల్లి, చందానగర్, పటాన్ చెరు సర్కిళ్ల వివిధ శాఖల అధికారులు, పలు కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, మహిళా పొదుపు సభ్యులు, బూత్ లేవల్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.