ఐటీ దాడులతో షాక్‌కు గురైన టాలీవుడ్..

556
it raids
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖులే టార్గెట్‌గా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి పలువురు నిర్మాతలు, దర్శకులు, హీరోల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. హీరో నాని,రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

జూబ్లీహిల్స్ లోని నాని నివాసం, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామునే నాని ఆఫీస్‌కి చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హీరోగా మంచి ఫాంలో ఉన్న నాని ఇటీవల నిర్మాతగానూ మారిన విషయం తెలిసిందే. వాల్ పోస్టర్‌ బ్యానర్‌ను స్థాపించిన నాని అ! సినిమాను నిర్మించాడు. హీరో విశ్వక్ సేన్ తో మరో సినిమాను ప్లాన్ చేశాడు నాని. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.

నిర్మాత నాగవంశీకి చెందిన సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ ఆఫీసుల్లో కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు టాలీవుడ్ ప్రముఖులకు చెందిన పది కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఐటీ దాడులతో టాలీవుడ్‌ షాక్‌కు గురైంది.

Income-Tax (I-T) Department on Wednesday conducted simultaneous raids on Ramanaidu Studios in Hyderabad

- Advertisement -