రేపు కోర్టులో హాజరుకానున్న రష్మీక మందన

186
rashmika

ఛలో మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన..ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఆమె నటించిన సినిమాలన్ని భారీ విజయాలను సాధించాయి. ఇటివలే ఆమె మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. ఈమూవీ భారీ విజయాన్ని సాధించింది. కాగా ఇటివలే రష్మిక ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఈ నెల 21న (మంగళవారం) బెంగళూరులోని ఐటీ కార్యాయంలో విచారణకు హాజరు కావాలని రష్మికతో పాటు ఆమె తండ్రి మదన్‌, తల్లి సుమన్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.

మూడు రోజుల క్రితం కొడగు జిల్లా విరాజపేటెలో ఉన్న రష్మిక నివాసం, వారి కుటుంబానికి చెందిన కల్యాణ మండపం, కార్యాలయంపై ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు గుర్తించి,పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా రష్మిక తండ్రి కాంగ్రెస్ లీడర్ కావడంతో ఐటీ దాడులు జరిగాయని చెబుతున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని..తమ వద్ద అన్ని రకాల పేపర్లు ఉన్నట్లు తెలిపారు. రేపు ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరవుతామని రష్మీక తండ్రి పేర్కోన్నారు.