అజ్ఞాతంలో కల్కి భగవాన్‌ దంపతులు..!

566
kalki bhagavan
- Advertisement -

తవ్వినకొద్ది కల్క భగవాన్ అక్రమాస్తులు భయటపడుతున్నాయి. ఇప్పటివరకు కల్కి ఆశ్రమంలో రూ. 500 కోట్లకు పైగా అక్రమాస్తులు భయటపడినట్లు తెలుస్తోంది. గుట్టల కొద్ది నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వజ్రాలు భయటపడటంతో ఐటీ అధికారులు ఖంగుతిన్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లోని కల్కి ఆశ్రమాలు, నివాసాలు, వ్యాపార సంస్థలపై ఆదాయం పన్ను (ఐటీ) అధికారుల దాడులు చేయగా మూడు రోజుల సోదాల్లో రూ.93 కోట్ల మేర సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు.

ఇందులో రూ.43.9 కోట్ల స్వదేశీ కరెన్సీ ఉండగా విదేశీ కరెన్సీలో అత్యధికంగా రూ.18 కోట్లు విలువ చేసే 25 లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయి. వీటితోపాటు 88 కిలోల బంగారం (విలువ రూ.26 కోట్లు), 1271 కేరట్ల వజ్రాలను (విలువ రూ.5 కోట్లు) స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వీటితోపాటు రూ.409 కోట్ల మేర అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించామన్నారు.

ఎల్‌ఐసీ గుమాస్తాగా ప్రస్థానాన్ని ప్రారంభించిన కల్కి అలియాస్ విజయ్ కుమార్ 1980ల్లో వన్నెస్ పేరుతో ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణం, ఆటలు ఇలా అనేక రంగాలకు విస్తరించారు. ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో కల్కి భగవాన్‌, ఆయన భార్య పద్మావతి జాడ తెలియడం లేదు. దీంతో వారిద్దరూ ఎక్కడ ఉన్నారనే దానిపై ఐటీ అధికారుల బృందం కూపీ లాగుతోంది.

- Advertisement -