నింగిలోకి మహిళా రోబోను పంపనున్న ఇస్రో..

435
- Advertisement -

ఇస్రో వచ్చే ఏడాది సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఎప్పటి నుండో అంతరిక్షంలోకి భారతీయులను పంపేందుకు ఇస్రో యోచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగా 2022లో గగన్ యాన్ మిషన్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను ఇస్రో అంతరిక్షంలోకి పంపబోతోంది. ఈ ముగ్గురు వ్యోమగాములను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎంపిక చేశారు. వీరికి రష్యాలోని అంతరిక్ష కేంద్రంలో అవసరమైన శిక్షణను ఇవ్వనున్నారు. గగన్ యాన్ కు ఎంపికైన ముగ్గురు వ్యోమగాములు పురుషులే కావడం గమనార్హం.

vyommitra

అయితే ఈ ముగ్గురి కంటే ఓ ముందుగా ఓ మహిళను ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. ఆమె పేరు ‘వ్యోమమిత్ర’. ఇది ఓ మహిళా హ్యూమనోయిడ్ రోబో కావడం విశేషం. మాన‌వ శ‌రీరంలో ఉన్న అవ‌య‌వాల ప‌నితీరును ప‌రీక్షించేందుకు ఇస్రో ఈ హాఫ్ హ్యుమ‌నాయిడ్‌ను పంప‌నున్న‌ట్లు ఇస్రో శాస్త్ర‌వేత్త శ్యామ్ ద‌యాల్ తెలిపారు.

నింగిలోకి ఓ రోబోను పంపిస్తామ‌ని, దాని నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు రిపోర్ట్‌ను అందుకుంటామ‌న్నారు. ఇది కేవ‌లం ప్ర‌యోగాత్మ‌క ప‌ద్ధ‌తిలో చేస్తామ‌న్నారు. వ్యోమ‌మిత్ర మిమిక్రీ చేయ‌గ‌ల‌దు. మ‌నుషులతో సంభాషించ‌గ‌ల‌దు. బెంగుళూరులో జ‌రిగిన మీడియా స‌మావేశంలో వ్యోమ‌మిత్ర‌ను జ‌ర్న‌లిస్టుల‌కు ప‌రిచ‌యం చేశారు.

- Advertisement -