పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగం విజయవంతం..!

654
PSLV-C47
- Advertisement -

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ47 ప్రయోగం విజయవంతంగా పూర్తి అయ్యింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి కార్టోశాట్-3ని మోసుకుంటూ, పీఎస్ఎల్వీ సీ-47, నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 9.28కి ప్రయోగం జరుగగా, నాలుగు దశలు విజయవంతం అయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వాహకనౌకలో థర్డ్ జనరేషన్ హై రెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ గా భావిస్తున్న కార్టోశాట్-3 అంతరిక్షంలోకి వెళ్లింది.

Isro

పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించి సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి, తీర ప్రాంత భద్రత తదితర అంశాల్లో ఈ ఉపగ్రహం సేవలను అందించనుంది. ఈ ఉపగ్రహం ద్వారా ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా తీయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని జీవితకాలం ఐదేళ్లు ఉంటుందని, బరువు 1,625 కిలోలని తెలిపారు. ఇక ఇదే వాహకనౌక ద్వారా అమెరికాకు చెందిన మరో 13 నానో ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపనుంది.

ప్రయోగించిన తరువాత 26.50 నిమిషాల వ్యవధిలోనే అన్ని ఉపగ్రహాలను వాటికి నిర్దేశించిన కక్ష్యల్లో ప్రవేశపెట్టింది రాకెట్. చంద్రయాన్‌-2 ప్రయోగం తర్వాత ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగం కావడంతో ఎలాంటి లోటుపాట్లు దొర్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు సైంటిస్టులు.

The Indian Space Research Organisation (Isro) is all set to launch the advanced earth observation and mapping satellite CARTOSAT-3..

- Advertisement -