విక్రమ్…ముక్కలు కాలేదు : ఇస్రో

675
isro
- Advertisement -

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2కు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. ఇస్రోకు మానస పుత్రికగా భావిస్తున్న చంద్రయాన్‌ 2లోని ల్యాండర్‌ విక్రమ్ జాడను ఆదివారం కనిపెట్టిన నిపుణులు అది ముక్కలైపోయి ఉంటుందని భావించారు.

కానీ ఇవాళ విక్రమ్ నిర్దేశిత లక్ష్యానికి అతి దగ్గరగా హార్డ్ ల్యాండ్ అయిందని తెలిపారు. ఆర్బిటర్ పంపిన ఫోటోల ద్వారా ల్యాండర్ సింగిల్ పిస్‌గానే ఉందని దానితో కమ్యూనికేషన్స్ ఏర్పరుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

హార్డ్ ల్యాండింగ్ జ‌రిగినా.. విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ ముక్కలు కాలేద‌ని చెప్పారు. ఇస్రో అనుకున్న ప్రాంతంలో విక్ర‌మ్ దిగ‌క‌పోయినా.. అది ప‌డ్డ ప్రాంతంలో మాత్రం ప‌క్క‌కు ఒరిగిన‌ట్టుగా ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్లడించారు.

శుక్రవారం చంద్రుడిపై విక్రమ్ ల్యాండ్ కావాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ల్యాండర్ ఆచూకీ కనిపించలేదు. దీంతో తీవ్రంగా నిరాశ చెందిన శాస్త్రవేత్తలకు ఇది ఊరట కలిగించే విషయమని అంతా భావిస్తున్నారు.

- Advertisement -