ఇక చంద్రయాన్‌ -3…!

540
isro shivan
- Advertisement -

చంద్రయాన్ -2 ప్రయోగం విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో ..ఇక చంద్రయాన్‌ -3 ప్రయోగానికి సిద్ధమవుతోంది. 2024కు చంద్రయాన్-3ని పంపే యోచనలో ఇస్రో ఉన్నట్లు సమాచారం. చంద్రయాన్ -3 చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలోని మట్టి, రాళ్ల శాంపిల్స్‌ను తిరిగి భూమికి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు. జపాన్ సహకారంతో చేపట్టాలని ఇస్రో భావిస్తోంది.

ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఇస్రో ఛైర్మన్ కె. శివన్‌.చంద్రయాన్-3 కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇస్రో ప్రయోగించిన మొదటి మూన్‌ ల్యాండింగ్ మిషన్‌ను ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా గమనిస్తోందని చెప్పారు.

ఇది అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రముఖమైన మిషన్‌ అని …చంద్రుడి మీదకు దిగే ల్యాండర్‌ విక్రమ్‌ ల్యాండింగ్ ప్రక్రియ వచ్చే నెల 7వ తేదీన ఉదయం 1.40 గంటలకు ప్రారంభమై.. దక్షిణ ధ్రువం మీదకు ఉదయం 1.55కు దిగుతుందని తెలిపారు .ఇస్రోలో లింగ అసమానతలకు స్థానం లేదని స్పష్టం చేశారు.

- Advertisement -