ఇస్రో ఛైర్మన్ కంటతడి.. హత్తుకుని ఓదార్చిన మోదీ

233
sivancries

చంద్రయాన్ 2 చంద్రుడి దగ్గరి వరకు వెళ్లి చివరి క్షణంలో విఫలమయిన సంగతి తెలిసిందే. దీంతో బెంగుళూరులోని ఇస్రో సెంటర్ లో శాస్త్రవేత్తలు తీవ్ర భావోద్వేగంతో ఉన్నారు. ఈరోజు ఉదయం ఇస్రో సెంటర్ కు వెళ్లిన ప్రధాని మోదీ శాస్త్రవేత్తలతో మాట్లాడారు. నిరాశ‌లో ఉన్న శాస్త్ర‌వేత్త‌ల‌కు సంఘీభావంగా ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగం చేశారు.

మోదీ ప్రసంగం తర్వాత వెళుతున్న సమయంలో ఇస్రో చైర్మన్ శివన్ భావోద్వేగానికి లోనయ్యారు. వీడ్కోలు చెప్పేందుకు వ‌చ్చిన శివ‌న్ క‌న్నీరు పెట్టుకున్నారు. దీంతో ప్ర‌ధాని మోదీ.. శివ‌న్‌ను ఓదార్చారు. గుండెకు హ‌త్తుకుని ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు. భవిష్యత్తులో ఇస్రో సాధించబోయే ఘన విజయాలకు ఇది బలమైన నాంది పలుకుతుందని చెప్పారు. ధైర్యంగా ఉండండి, ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదు, దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుందని భరోసా ఇచ్చారు.