ఇస్మార్ట్ శంకర్ రెండురోజుల వసూళ్లెంతో తెలుసా..?

138
ismart

పూరీ జ‌గ‌న్నాథ్‌, రామ్ పోతినేని కాంబినేష‌న్‌లో తెరకెక్కిన మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్‌-పూరిలకు ఈ మూవీ కాస్త రిలీఫ్‌ ఇచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ని తెగ ఎంజాయ్‌ చేస్తోంది చిత్రయూనిట్.

జూలై 18న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. రెండు రోజుల్లో రూ. 25 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళ‌ని రాబ‌ట్టింది. తొలిరోజు రూ. 15 కోట్లు రాబట్టగా రెండోరోజు అదేజోరుని కంటిన్యూ చేస్తూ రూ. 10 కోట్లు రాబట్టింది.

పూరి మార్క్ హీరోయిజం కి రామ్ ఎనర్జీ తోడవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాగా పేలింది. నిధి అగర్వాల్, నభా నటేశ్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రాన్ని టూరింగ్‌ టాకీస్‌, పూరి కనక్ట్‌ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్ లు లాభాలలోకి ప్రవేశించారని సమాచారం. ఇక ఈ వీకెండ్‌లో మూవీ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.