ట్రైలర్‌తో ఇరగదీసిన ‘ఇస్మార్ట్ శంకర్’..

364
Ismart Shankar
- Advertisement -

టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ విడుదలైంది. రామ్‌ పోతినేని హీరోగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టించారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం జూలై 18న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో రామ్ లుక్‌తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా విభిన్నంగా ఉంటుంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ చిత్రానికి సంగీతం అందించ‌గా, ఆయ‌న స్వ‌ర‌ప‌ర‌చిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

ఇక ఈ చిత్ర ట్రైల‌ర్ విషయానికొస్తే.. ఫైటింగ్ సన్నివేశంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ‘ఏ బొమ్మా .. నువ్వు ‘ఊ’ అంటే గోల్కొండ రిపేరు జేసి నీ చేతిలో పెడతా. నిన్ను బేగంను చేసి ఖిల్లా మీద కూర్చో పెడతా.. క్యా బోల్తే..ఆ’ అంటూ రామ్ వాయిస్ ఓవర్, ‘ఒరేయ్, వరంగల్ కాలేజీలో పోరగాళ్లను ఉచ్చ పోయించినా..’ అంటూ నభా నటేశ్ డైలాగ్స్ చెప్పడం గమనించవచ్చు. రాయ రాయె రాయ రాయె మైసమ్మ, బల్కంపేట ఎల్లమ్మవే, మా తల్లి బంగారు మైసమ్మవే..’ అంటూ సాగే పాటలో రామ్ కనిపిస్తాడు. ట్రైలర్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ఇరగదీశాడు. మరి సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

- Advertisement -