“ఇస్మార్ట్ శంకర్” రూ.80కోట్లు

267
Ismart Shankar

ఎనర్జీటిక్ స్టార్ రామ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ లు హీరోయిన్ లుగా నటించారు. పూరీ సొంత బ్యానర్ లో ఈసినిమాను నిర్మించారు. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈసినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. గత మూడు సంవత్సరాలుగా ప్లాప్ లతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్ కు సరైన టైంలో హిట్ పడింది.

ismart

మరోవైపు రామ్ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు.. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ దూసుకెళ్తున్న ఈసినిమా నేటితో 25రోజులకు చేరుకుంది. దీంతో ఇప్పటి వరకూ రూ.80కోట్ల వసూలు చేసింది. రామ్ కెరీర్ లోనే ఈసినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది.

ఈవారం వేరే మూవీలో విడుదల కానుండటంతో ఇస్మార్ట్ శంకర్ హవా తగ్గనుందని చెప్పుకోవాలి. ఇక ఈసినిమా తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు పూరీ జగన్నాథ్. ఈసినిమాను ఛార్మీ నిర్మించనున్నారు. త్వరలోనే ఈసినిమాను సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు.