ఇస్మార్ట్ శంకర్ సెన్సార్ పూర్తీ…సెంటిమెంట్ ఫాలో అవుతున్న పూరీ

275
Ismart Shankar
- Advertisement -

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇస్మార్ట్ శంకర్. నభా నటేష్, నిధి అగర్వాల్ నటించిన ఈసినిమాను పూరీ జగన్నాథ్, చార్మీలు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం పాటలు, ట్రైలర్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి. మణిశర్మ అందించిన మ్యూజిక్ ఈచిత్రానికి హైలెట్ గా నిలవనుందని తెలుస్తుంది. ఈనెల 18న విడుదల కానున్న ఈచిత్రం సెన్సార్ ను పూర్తి చేసుకుంది. ఇస్మార్ట్ శంకర్ కు సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ను ఇచ్చింది.

సాధార‌ణంగా త‌న సినిమాకు ‘ A’ స‌ర్టిఫికేట్ వ‌స్తే ద‌ర్శ‌క నిర్మాత‌లకు కొంచెం టెన్షన్ ఉంటుంది.ధియేటర్లకు ఫ్యామిలీ ఆడియ‌న్స్ రారేమో అని టెన్ష‌న్ ప‌డ‌తారు. కానీ ఇక్కడ పూరీ మాత్రం ఫుల్ హ్యపీ అవుతున్నాడు. ఎందుకంటే ఈయ‌న పూర్తిగా ‘ఇస్మార్ట్ శంక‌ర్’ సినిమాను ‘ A’ స‌ర్టిఫికేట్ ప్రేక్ష‌కుల కోస‌మే తెరకెక్కించాడు. ఈ చిత్రంతో క‌చ్చితంగా హిట్ కొడ‌తామని పూరి అండ్ టీం బలంగా నమ్ముతోంది.

A సర్టిఫికేట్ రావడంతో దీనికి ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసిన పోకిరి.. అల్లు అర్జున్ దేశ‌ముదురు.. మ‌హేష్ బాబు బిజినెస్‌మేన్ కూడా అప్ప‌ట్లో ‘ A’ స‌ర్టిఫికేట్ తెచ్చుకున్నాయి. ఈ మూడు సినిమాలు మంచి విజ‌యాలు సాధించాయి. ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాకు కూడా ‘ A’ వ‌చ్చింది. పూరీ నమ్మకాన్ని ఇస్మార్ట్ శంకర్ నిలబెడుతుందో లేదో చూడాలి.

- Advertisement -