ఖరీదైన కారును సొంతం చేసుకున్న హీరోయిన్

998
Nabha
- Advertisement -

సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నభా నటేశ్ తన నటన అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయం సాధించడంతో అమ్మడుకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈమూవీ తర్వాత అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా నభా నటేశ్ ఖరీదైన కారును కోనుగోలు చేసింది.

Nabha Natesh Buys Mercedes Car_5

బీఎమ్ డబ్ల్యూ కారును ఆమె సొంతం చేసుకుంది. కొత్త కారుతో ఆమె ఫోటోలను ఫోజులిచ్చింది. ఈఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ సాధించడంతో నభాకు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కో రాజా మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ మూవీ భారీ లాభాలు సాధించడంతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీలు కూడా రెండు ఖరీదైన కార్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -