జీ సినీ అవార్డ్స్‌….ఇస్మార్ట్ శంకర్ హవా

405
ismart Shankar Team
- Advertisement -

హీరో రామ్ పొత్తినేని ప్రధాన పాత్రలో దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. నభా నటేశ్, నిధి అగర్వాల్ లు హీరోయిన్లుగా నటించారు. జులైలో విడుదలైన ఈమూవీ భారీగా కలెక్షన్లను రాబట్టింది. అంతేకాకుండా రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. చాలా రోజుల తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ కు పెద్ద హిట్ వచ్చింది.

ఇక తాజాగా ప్రకటించిన జీ సినీ అవార్డ్స్ లో ఇస్మార్ట్ శంకర్ మూవీ తన సత్తాను చాటింది. ఏకంగా నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది ఇస్మార్ట్ శంకర్ చిత్రం. పూరీ జ‌గ‌న్నాథ్ బెస్ట్ సెన్సేష‌న‌ల్ డైరెక్టర్‌గా, రామ్ బెస్ట్ సెన్సేష‌న‌ల్ హీరోగా, ఛార్మి బెస్ట్ సెన్సేష‌న‌ల్ ప్రొడ్యూస‌ర్‌గా, బెస్ట్ సెన్సేష‌న‌ల్ మూవీగా ఇస్మార్ట్ శంక‌ర్,బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మ‌ణిశ‌ర్మలు ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రానికి అవార్డులు పొందారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఇన్ని అవార్డులు రావడం పట్ల చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సైరా నరసింహారెడ్డి చిత్రానికి గాను మెగాస్టార్ చిరంజీవి ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి పురస్కారం సమంతకు దక్కింది.

- Advertisement -